ఎకై ్సజ్ శాఖలో బదిలీలు చేపట్టండి
ఖలీల్ వాడి: ఎకై ్సజ్ శాఖలో బదిలీలు చేపట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావుకు ప్రొబేషనరీ అండ్ ఎకై ్సజ్ ఉమ్మడి జిల్లా హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. బుధవారం జిల్లా కేంద్రానికి విచ్చేసిన మంత్రికి హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ విన్నవించారు. ఎనిమిదేళ్ల నుంచి బదిలీలు జరగలేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మంత్రి సానుకూలంగా స్పందించి, ఎలక్షన్ కోడ్ ఉండటంతో ఎకై ్సజ్ శాఖలో బదిలీలు ఆలస్యమైనట్లు చెప్పారు. మే నెలలో బదిలీలు చేయాలని కమిషనర్‌కి చెప్పినట్లు తెలిపారు. ప్రెసిడెంట్ రవి కుమార్, సెక్రెటరీ చంద్రమోహన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ భోజన్న, ప్రెస్ సెక్రటరీ ఉత్తమ్, జాయింట్ సెక్రెటరీ మంజుల తదితరులున్నారు.


