సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

Apr 13 2025 1:54 AM | Updated on Apr 13 2025 1:54 AM

సీఎంఆ

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

సిరికొండ: మండలంలోని గడ్కోల్‌, పెద్దవాల్గోట్‌, సర్పల్లి తండాలో బాధితులకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను కాంగ్రెస్‌ నాయకులు శనివారం పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో ఏఎంసీ డైరెక్టర్‌ సంపత్‌రెడ్డి, భానుచందర్‌, గాదారి నర్సారెడ్డి, రాంరెడ్డి, నర్సింగ్‌, నర్సారెడ్డి, లియాఖత్‌ అలీ, భాస్కర్‌రెడ్డి, గవాస్కర్‌, హేమంత్‌, అఖిల్‌, రంజిత్‌, సుమన్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

వనజీవి రామయ్య

మృతి బాధాకరం

నిజామాబాద్‌ రూరల్‌: పర్యావరణ పరిరక్షణకు కోటి మొక్కలు నాటిన వనజీవి రామయ్య మృతి పర్యావరణ ఉద్యమానికి లోటు అని తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామిడి సతీశ్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు బానోత్‌ ప్రేమ్‌లాల్‌ అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ రామయ్య ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు.

ఆలయానికి ఇత్తడి

మకర తోరణాల వితరణ

సిరికొండ: మండలంలోని గడ్కోల్‌లో హనుమాన్‌ ఆలయానికి ఇత్తడితో చేసిన మకర తోరణాలను గ్రామానికి చెందిన పీఎంపీ వైద్యుడు అమరవాజీ జీవన్‌, ప్రమీల దంపతులు వితరణ చేశారు. రూ. నలభై వేల విలువ గల శివ లింగానికి నాగ తోరణం, హనుమాన్‌ విగ్రహనికి మకర తోరణాలను వారు అందచేశారు. దాతలను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తీగల నరేశ్‌, మామిడి రాములు, మల్లెల లింబాద్రి, సండ్ర శంకర్‌, నిమ్మల భాస్కర్‌, రఘురాజ్‌, నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

అంబేడ్కర్‌ ఉత్సవాల నిర్వహణకు అనుమతి ఇవ్వండి

ఖలీల్‌వాడి: నగరంలోని వర్ని చౌరస్తాలో ఈనెల 14న నిర్వహించే అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వర్ని రోడ్‌ మాల సంఘం సభ్యులు ఏసీపీ, రెండో టౌన్‌ ఎస్సైకు శనివారం వినతిపత్రం అందజేశారు. దీనికి ఏసీపీ సానుకూలంగా స్పందించి ఉత్సవాలు జరుపుకోవడానికి అనుమతి ఇచ్చినట్లు వారు తెలిపారు. నాయకులు రామచంద్ర గైక్వాడ్‌, ముత్యాల మారుతి ఉన్నారు.

కానూరి, పైలా వర్ధంతి సభ

సిరికొండ: మండలంలోని తూంపల్లిలో కానూరి వెంకటేశ్వర్లు, పైలా వాసుదేవరావుల వర్ధంతి సభను శనివారం నిర్వహించారు. సభకు న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి భాస్కర్‌ హాజరై మాట్లాడారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యను అభివృద్ధి చేయడంలో కానూరి క్రీయాశీలక పాత్ర పోశించారని అన్నారు. భూమి భుక్తి విముక్తి కోసం సాగిన శ్రీకాకుళ సాయుధ పోరాటంలో పైలా వాసుదేవరావు అగ్ర భాగాన నిలిచిన యోధుడని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు గంగారెడ్డి, బైరయ్య, చిన్నక్క, రాజగంగు, సాయవ్వ, లక్ష్మి, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

‘వచనాలయ సలహాదారుల నియామకం చెల్లదు’

నిజామాబాద్‌ సిటీ: బాపూజీ వచనాలయంలో నూతనంగా నియమించిన సలహాదారుల నియామకం చెల్లదని, అది బైలాస్‌కు విర్ధుమని పరిరక్షణ పోరాట సమితి కన్వీనర్‌ కోనేరు సాయికుమార్‌ మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని బాపూజీ వచనాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాపూజీ వచనాలయ అధ్యక్షుడిగా చెలామణి అవుతున్న ఢిల్లీ భక్తవత్సలం నాయుడు కొంతమందిని సలహాదారులుగా నియమించుకున్నారని అది చెల్లదని తెలిపారు. ఎన్నికలు ఆపాలని తాను హైకోర్టులో కేసు వేశానని, అది పెండింగ్‌లో ఉందని గుర్తుచేశారు. బాపూజీ వచనాలయ ఆస్తులను పరిరక్షించాలని కోరారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ
1
1/4

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ
2
2/4

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ
3
3/4

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ
4
4/4

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement