హిందువుగా పుట్టడం అదృష్టం | - | Sakshi
Sakshi News home page

హిందువుగా పుట్టడం అదృష్టం

Apr 13 2025 1:52 AM | Updated on Apr 13 2025 1:52 AM

హిందు

హిందువుగా పుట్టడం అదృష్టం

సుభాష్‌నగర్‌: హిందువుగా పుట్టడం అదృష్టంగా భావించాలని, ఇందూరు గడ్డపై హిందుత్వం ఎంత బలంగా ఉందో విజయయాత్రతో మరోసారి నిరూపితమైందని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. నగరంలోని ఆర్‌ఆర్‌ చౌరస్తాలో శనివారం రాత్రి నిర్వహించిన ముగింపు సభకు ముఖ్యఅతిథిగా అర్వింద్‌ హాజరై మాట్లాడారు. హిందూ ధర్మానికి రక్షణ కవచంగా ఆంజనేయస్వామిని భావిస్తామన్నారు. సనాతన ధర్మం గొప్పదని, హిందువులందరం ధర్మం, దేశాన్ని కాపాడుకోవడానికి ఒక్కటిగా నిలబడాలని పిలుపునిచ్చారు.

శంభుని గుడి కబ్జాలను తొలగిస్తాం

నగరంలోని శంభునిగుడి వద్ద కబ్జాలను తొలగించి తీరుతామని, అందుకు హిందూ బంధువులందరి సహకారం కా వాలని అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ అ న్నారు. ఎక్కడైనా దేవాలయాలకు నష్టం కలిగిస్తే హిందువులంతా సంఘటితమై అక్కడికి చేరుకోవాలని, ఇందూరులోని శంభుని గుడి, ఖిల్లా రామాలయం అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. యాత్రలో పాల్గొని వి జయవంతం చేసిన ప్రతి హిందువుకు ధన్యవాదాలు తె లుపుతున్నామన్నారు. హిందూ సంఘాల ప్రతినిధు లు కాపర్తి గురుచరణం, గుమ్మళ్ల సత్యం, తమ్మల కృష్ణ, కిర ణ్‌ తోటావార్‌, రెంజర్ల నరేశ్‌, బ్రహ్మానంద సర స్వతి, ఇ ప్పకాయల హరిదాసు, దినేశ్‌ ఠాకూర్‌, కమ్మరి లక్ష్మణ్‌, ధాత్రిక రమేశ్‌, నాగోళ్ల లక్ష్మీనారాయణ, వీహెచ్‌ పీ, బజ రంగ్‌దళ్‌, హిందూవాహిని ప్రతినిధులు పాల్గొన్నారు.

ముగింపు సభకు హాజరైన ప్రజలు

హిందువుగా పుట్టడం అదృష్టం 1
1/2

హిందువుగా పుట్టడం అదృష్టం

హిందువుగా పుట్టడం అదృష్టం 2
2/2

హిందువుగా పుట్టడం అదృష్టం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement