నిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు శుక్రవారం ఐదో విడత నీటి విడుదలను ప్రారంభించారు. ప్రాజెక్టు ఆయకట్టు కింద 1.25 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు విడతల్లో నీటిని అందించారు. ఐదో విడతలో రోజూ వెయ్యి క్యూసెక్కుల చొప్పు న నీటిని అందించనున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా శుక్రవారం సాయంత్రానికి 1,396.92 అడుగుల (8.351 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టునుంచి నీటిని విడుదల చేస్తున్నందున ప్రధాన కాలువలోకి ఎవరూ వెళ్లవద్దని అధికారులు కోరారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని రైతులకు సూచించారు. ఆయకట్టు కింద సాగు చేసిన ప్రతి గుంటకు సాగు నీరు అందించి పంటలను గట్టెక్కిస్తామని అధికారులు పేర్కొన్నారు.
నేటి నుంచి
ఒంటిపూట బడులు
నిజామాబాద్‌అర్బన్ : నేటి నుంచి ఒంటిపూ ట బడులు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్ ఒక ప్రకటనలో తెలిపా రు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పాఠశాలలు కొనసాగుతాయన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనం అందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో మధ్యా హ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు కొనసాగుతా యని తెలిపారు.
గ్రూప్స్‌లో జిల్లావాసి సత్తా
నిజామాబాద్‌నాగారం: గ్రూప్స్ ఫలితాల్లో జిల్లాకు చెందిన ఆనంద్‌కుమార్ సత్తా చాటాడు. కమ్మర్‌పల్లి మండలం ఉప్లూర్ గ్రామానికి చెందిన ఆనంద్–కరుణల కుమారుడు ఆనంద్. 2012లో ఎంఫార్మసీ పూర్తిచేశారు. అనంతరం ఢిల్లీలోని ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం సాధించాడు. కానీ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఐదేళ్ల క్రితం ఉద్యోగం మానేసి జిల్లాకు తిరిగి వచ్చేశాడు. అప్పటినుంచి పోటీ పరీక్షలకు సన్నద్ధమవగా గ్రూప్స్ పరీక్షలు రాశాడు. గత సంవత్సరం విడుదలైన గ్రూప్–4లో ఉత్తమ మార్కులు రావడంతో వాణిజ్య పన్నులశాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించాడు. గ్రూప్ 1, 2, 3 పరీక్షలు రాయగా అందులోనూ ఉత్తమ మార్కులు సాధించాడు. గ్రూప్ 1లో 448 ర్యాంకు, గ్రూప్–2 ఫలితాల్లో 359 మా ర్కులతో 877 ర్యాంకు, బీసీ–సీ కేటగిరిలో రాష్ట్రస్థాయిలో–5వ ర్యాంకు సాధించాడు. శుక్రవారం విడుదలైన గ్రూప్–3 ఫలితాల్లో 281 మార్కులతో 506 ర్యాంకు సాధించారు. బీసీ– సీ కేటాగిరిలో ప్రథమ ర్యాంకు సాధించాడు. ప్రభుత్వ ఉద్యోగం సాధించ డం చాలా సంతోషంగా ఉంది. ఐదేళ్లు శ్రమించిన కష్టానికి ఫలితాలు వచ్చాయని ఆనంద్ కుమార్ చెప్పారు.


