
శ్రీకాంత్ (ఫైల్)
కామారెడ్డి క్రైం: బైక్‌ను ప్రైవేట్ స్కూ ల్ బస్సు ఢీకొట్టిన ఘటనలో రాజంపేట మండలం తలమడ్లకు చెందిన మంచనపల్లి శ్రీకాంత్(22) అనే యువకుడు మృతి చెందా డు. వివరాలు ఇలా ఉన్నాయి.. కామారెడ్డిలోని ఓ ఫైనాన్స్ కంపెనీలో మార్కెటింగ్ ఏజెంట్‌గా పని చేస్తున్న శ్రీకాంత్ మంగళవారం ఉదయం అమ్మమ్మ సాయవ్వ, సోదరి సింధూజతో కలిసి బైక్‌పై కామారెడ్డికి వస్తున్నాడు. ఈ క్రమంలో హెచ్‌పీ హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద అతివేగం, అజాగ్రత్తగా వచ్చిన ఓ స్కూల్ బస్సు యూటర్న్ తీసుకుంటూ బైక్‌ను ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన ముగ్గురిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. శ్రీకాంత్ పరిస్ధితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించినప్పటికీ అక్కడికి చేరుకునేసరికి మృతి చెందాడు. మృతుడి తండ్రి నాగభూషణం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పట్టణ ఎస్‌హెచ్‌వో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.