
ఘనంగా గోపూజ
నిజామాబాద్ సిటీ: నగరంలోని కోదండ రామాలయంలో సోమవారం గోకుల్ గోసేవా సమితి ఆధ్వర్యంలో గోపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శ్రీ రామనవమి ఉత్సవాల సందర్బంగా నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా మొదటిరోజు గోపూజ, ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. సమితి అధ్యక్షుడు రాంమ్మోహన్, మూఢ నాగభూషణం గుప్తా, మోటూరి మురళీ, టీఎస్ వ్యాస్ రాజశేఖర్, శంకర్, మూఢ శ్రీనివాస్, పాపిని సతీష్, అరుణ్ పాల్గొన్నారు.
వైభవంగా ఆలయ శిఖర ప్రతిష్ఠాపన
బోధన్‌రూరల్(బోధన్): సాలూర మండల కేంద్రంలోని ఒంటి హనుమాన్ ఆలయంలో శిఖర ప్రతిష్ఠా పన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులు, గ్రామస్తులకు అన్నదానం ఏర్పాటు చేసి అన్న ప్రసాదాలను వితరణ చేశారు.
