
జక్రాన్‌పల్లి: మండలంలోని మునిపల్లిలో ఆదివారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తనయుడు బాజిరెడ్డి అజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి, తన తండ్రి బాజిరెడ్డిని అత్యధిక మెజారీటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. అలాగే బ్రాహ్మణ్‌పల్లిలో జెడ్పీటీసీ తనుజారెడ్డి, సికింద్రాపూర్‌లో ఎంపీపీ విమల, పడకల్‌లో సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు పుప్పాల శ్రీనివాస్, పార్టీ అధ్యక్షుడు నట్ట బోజన్న ప్రచారం చేపట్టారు. నాయకులు కుంచాల రాజు, పాట్కురి శ్రీనివాస్‌రెడ్డి, మైదం రాజన్న, పు ప్పాల శ్రీనివాస్,గడ్డం గంగారెడ్డి, బాలకిషన్, జైపా ల్‌రెడ్డి, పోతే రాజు, దేవరాజ్, రాజేశ్వర్ ఉన్నారు.
బాజిరెడ్డికి మద్దతుగా తీర్మానం..
మండలంలోని పడకల్‌లో ఎమ్మెల్యే బాజిరెడ్డికి ఎస్సీ మాల సంఘ సభ్యులు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించారు. తామంత బీఆర్‌ఎస్‌కు ఓటు వేసి ఎమ్మెల్యే గెలుపునకు కృషి చేస్తామని ప్రకటించారు. గ్రామ ఉప సర్పంచ్ రిత్విక్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకుడు విజయ్‌కు తీర్మాన పత్రాన్ని అందజేశారు.సంఘ పెద్దలు బక్కన్న, గంగాధర్, అశోక్, సంఘ సభ్యులు పాల్గొన్నారు.
ఖలీల్‌వాడి: నగరంలోని 34వ డివిజన్ మిర్చి కాంపౌండ్‌లో ఆదివారం బీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ బిగాల మహేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నగరంలో అభివృద్ధి సంక్షేమాన్ని చూసి బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. కార్పొరేటర్ బురుగుపల్లి కల్పన మల్లేష్ గుప్తా, నాయకులు జుగల్ కిషోర్ పాండే, ఎట్టం మహేష్, గోపు అనిల్, ఎగిశాల నర్సింలు, అరుణ్, ఆకుల శ్రీశైలం పాల్గొన్నారు.


నగరంలో ప్రచారం చేస్తున్న బీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ బిగాల మహేష్
Comments
Please login to add a commentAdd a comment