సింగిల్‌ఫేజ్‌ స్థంబానికి కరెంట్‌ వైర్‌ పెడుతుండగా.. విషాదం! | - | Sakshi
Sakshi News home page

సింగిల్‌ఫేజ్‌ స్థంబానికి కరెంట్‌ వైర్‌ పెడుతుండగా.. విషాదం!

Nov 18 2023 1:22 AM | Updated on Nov 18 2023 1:14 PM

- - Sakshi

ఇంతియాజ్‌ (ఫైల్‌)

నిజామాబాద్‌: తాడ్వాయి మండలంలోని క్రిష్ణాజివాడిలో దూదేకుల ఇంతియాజ్‌ (25)అనే యువకుడు శుక్రవారం విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. గ్రామ శివారులోని తన ఫౌల్ట్రీఫాం వద్దకు వెళ్లిన ఇంతియాన్‌ అక్కడనేఉన్న సింగిల్‌ఫేజ్‌ స్థంబానికి కరెంట్‌ వైర్‌ పెడుతుండగా విద్యుదాఘాతంతో మృతి చెందాడు. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య అఫ్రిస్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
ఇవి చదవండి: రోడ్డు ప్రమాదంలో మైనర్‌ బాలుడు..

Advertisement
 
Advertisement
Advertisement