రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలకు ఎంపిక | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలకు ఎంపిక

Published Sat, Nov 11 2023 2:00 AM

విద్యార్థినులను అభినందిస్తున్న ప్రిన్సిపాల్‌ సంగీత - Sakshi

జక్రాన్‌పల్లి: మండలంలోని కలిగోట్‌ గ్రామానికి చెందిన అక్షర, భవ్య, పరిమళ, అక్షయ రాష్ట్ర స్థాయి అండర్‌–19 వాలీబాల్‌ పోటీలకు ఎంపికై నట్లు పీఈటీ యాదగిరి తెలిపారు. వీరు ఈ నెల 10 నుంచి 12 వరకు సిద్దిపేటలో జరిగే రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర స్థాయికి ఎంపికై న క్రీడాకారులను సర్పంచ్‌ చేతన విజయ్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ నాయిక రాజు, ఎంపీటీసీలు జయ గిరిధర్‌గౌడ్‌, ఎస్‌ఎంసీ చైర్మన్‌ సత్యనారాయణ, వీడీసీ సభ్యులు అభినందించారు.

రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు..

డిచ్‌పల్లి: డిచ్‌పల్లి మండలం ధర్మారం(బి)లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలకు చెందిన విద్యార్థినులు రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్‌ సంగీత శుక్రవారం తెలిపారు. సదాశివ్‌నగర్‌ మండలంలోని ఉప్పల్‌వాయి గురుకుల పాఠశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభను కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారని తెలిపారు. ఈనెల 10 నుంచి 12 వరకు మహబూనగర్‌ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో కళాశాలకు చెందిన డి నవనీత, ఎం ప్రణీత, వి యశస్విని, బి వర్ష, జి మేఘన పాల్గొంటారని తెలిపారు. వీరిని ప్రిన్సిపాల్‌ సంగీత, ఫిజికల్‌ డైరెక్టర్‌ రాజారెడ్డి, పీఈటీ జ్యోత్స్న అభినందించారు.

వాలీబాల్‌ పోటీలకు..

డిచ్‌పల్లి: సిద్దిపేట ఈ నెల 10, 11, 12 తేదీల్లో జరిగే అండర్‌ – 19 వాలీబాల్‌ పోటీలకు డిచ్‌పల్లిలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థి ఎండీ నోమాన్‌ ఎంపికై నట్లు ప్రిన్సిపాల్‌ చంద్రవిట్టల్‌ తెలిపారు. విద్యార్థి ని అధ్యాపకులు అభినందించారు.

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న కలిగోట్‌ క్రీడాకారులు
1/2

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న కలిగోట్‌ క్రీడాకారులు

నోమాన్‌
2/2

నోమాన్‌

Advertisement
 
Advertisement
 
Advertisement