
వాహనాలను సీజ్ చేస్తున్న అధికారులు
కామారెడ్డి టౌన్: మున్సిపల్ పరిధిలో అనుమతి లేకుండా సెప్టిక్ ట్యాంకుల నుంచి వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో ఖాళీ చేస్తున్న నిర్వాహకులపై చర్య లు తీసుకొని నాలుగు వాహనాలను సీజ్ చేసినట్లు సానిటరీ ఇన్‌స్పెక్టర్ రవీందర్ గురువారం తెలిపా రు. మున్సిపల్ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా సెప్టిక్ ట్యాంక్‌ల నుంచి వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో ఖాళీ చేస్తే చర్యలు తప్పవని నిర్వాహకులను హెచ్చరించారు. ఆయన వెంట సానిటరీ ఇన్‌చార్జి పర్వేజ్, ఎన్విరాల్‌మెంట్ ఇంజినీర్ అబ్దుల్ ముమీన్, జవాన్ దుర్గాప్రసాద్, సిబ్బంది ఉన్నారు.