న్యూస్‌రీల్
గిడ్డంగుల్లోనే మగ్గుతున్న పీడీఎస్ రైస్ నాణ్యత దెబ్బతింటున్నా వేలంలో జాప్యం జిల్లావ్యాప్తంగా 3,089 క్వింటాళ్ల బియ్యం నిల్వ..
పేదల బియ్యం.. పురుగుల పాలు!
అర్జీలు త్వరగా పరిష్కరించాలి
అర్జీలు సత్వరం పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణిలో అర్జీలు స్వీకరించారు.
కడ్తాల్ అయ్యప్ప
ఆలయానికి రూ.50 లక్షలు
లక్ష్మణచాంద: సోన్ మండలం కడ్తాల్‌లోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 లక్షలు మంజూరయ్యాయని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఆలయాన్ని సోమవారం సందర్శించారు. గురుస్వామి నర్సారెడ్డి, ట్రస్ట్ సభ్యులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల కోసం రూ.50 లక్షలు మంజూరు చేయించానని, ప్రస్తుతం రూ.39.80 లక్షలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఆలయం పక్కన షెడ్డు నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు అదనపు నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గురుస్వామి చెనిగారపు చిన్నయ్య, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సత్యం చంద్రకాంత్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, నాయకులు రాంనాథ్, రమణారెడ్డి, జమాల్, సరిగెల గంగన్న, సాదం అరవింద్, హరీశ్‌రెడ్డి, జుట్టు దినేష్, కందుల హరీశ్, సాత్విక్, జాఫ్రాపూర్ సర్పంచ్ రాజురెడ్డి పాల్గొన్నారు.
ఖానాపూర్: పేదల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ మహారాష్ట్రలో ఎక్కువ ధరకు అమ్ముకునే దందా ఇటీవల కాస్త తగ్గింది. రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో చాలా మంది వాటినే తింటున్నారు. అయితే కొందరు మాత్రం డీలర్లకే విక్రయిస్తున్నారు. కొందరు ఇళ్లకు తెచ్చుకుని దళారులకు అమ్ముతున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఇలా పట్టుకున్న బియ్యం పురుగులపాలవుతోంది. జిల్లాలోని వివిధ ఎంఎల్‌ఎస్ గిడ్డంగుల్లో నె లకొని మగ్గుతోంది. సకాలంలో వేలం నిర్వహించి విక్రయించకపోవడంతో నాణ్యత దెబ్బతింటోంది.
3,089 క్వింటాళ్ల నిల్వలు
జిల్లాలోని నాలుగు ఎంఎల్‌ఎస్ గిడ్డంగుల్లో మొత్తం 3,089 క్వింటాళ్ల అక్రమ బియ్యం నిల్వ ఉందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో ఖానాపూర్‌లో 234 క్వింటాళ్లు, నిర్మల్‌లో 2,200 క్వింటాళ్లు, భైంసాలో 560 క్వింటాళ్లు, ముధోల్‌లో 95 క్వింటాళ్లు ఉన్నాయి. ఎక్కువకాలం నిల్వ ఉండటంతో బియ్యానికి లక్క పురుగులు పట్టి నాణ్యత తగ్గుతోంది. గతంలో అధికారులు రెండుసార్లు వేలం నిర్వహించినా నాణ్యత దెబ్బతినడంతో వ్యాపారులు కొనుగోలుకు ఆసక్తి చూపలేదు. సంచులకు రంధ్రాలు పడటంతో నిల్వలు కూడా తగ్గుతున్నాయని గిడ్డంగి సిబ్బంది చెబుతున్నారు.
ఇప్పటికై నా స్పందించాలి..
ఏళ్ల తరబడి గిడ్డంగుల్లో నిల్వలు పేరుకుపోతున్నా వాటిని సకాలంలో విక్రయించడంలో జాప్యం జరుగుతోందని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి వేలం ద్వారా ఈ నిల్వలను తొలగించి, కొత్తగా వచ్చే ప్రజా పంపిణీ బియ్యం నాణ్యత దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
త్వరలో వేలం..
పట్టుబడిన బియ్యం నిల్వల విషయాన్ని జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, ఆయన అనుమతితో త్వరలో వేలం నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా దొడ్డు బియ్యం వేలం నిర్వహించడంతో తరలింపు ప్రక్రియ దాదాపు పూర్తయింది. మిగిలిన బియ్యం నిల్వలు మరింత పాడవకముందే వేలం పూర్తి చేస్తాం.
– రాజేందర్, డీఎస్‌వో, నిర్మల్
కొత్త బియ్యానికీ ముప్పు..
గిడ్డంగుల్లో పేరుకుపోయిన పాత బియ్యానికి పురుగులు పట్టడంతో కొత్తగా వచ్చే నిల్వలపైనా ప్రభావం పడే ప్రమాదం ఉంది. ప్రతినెలా ప్రజా పంపిణీ కోసం ఎఫ్‌సీఐ గిడ్డంగుల నుంచి ఎంఎల్‌ఎస్ కేంద్రాలకు చేరుతున్న తాజా బియ్యం నాణ్యత కూడా దెబ్బతినే అవకాశం ఉంది. పాత నిల్వలను సకాలంలో తొలగించకపోవడం వల్ల కొత్త బియ్యం నిర్వహణ కూడా సమస్యగా మారుతోంది. ప్రజలకు పంపిణీ చేయాల్సిన బియ్యం నాణ్యతపై అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.


