హెచ్‌ఐవీ బాధితులకు మెరుగైన చికిత్స అందించాలి | - | Sakshi
Sakshi News home page

హెచ్‌ఐవీ బాధితులకు మెరుగైన చికిత్స అందించాలి

Nov 17 2026 12:14 AM | Updated on Nov 17 2026 12:14 AM

నిర్మల్‌చైన్‌గేట్‌: హెచ్‌ఐవీ నిర్ధారణ కాగానే ఏఆర్టీ మెడిసిన్‌ సత్వరమే ఇప్పించి ఎయిడ్స్‌ బారిన పడకుండా మెరుగైన చికిత్స అందించాలని రాష్ట్ర నియంత్రణ సంస్థ జాయింట్‌ డైరెక్టర్‌ ప్రసాద్‌, జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్‌ పవన్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని శూర్‌ ఎన్జీ వో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. హెచ్‌ఐవీ దశలోనే మందులు క్రమం తప్పకుండా వాడి పోషకా హారం తీసుకుంటే జీవితకాలం పెంచుకోవచ్చ ని తెలిపారు. మందులు సక్రమంగా వాడేలా ఐసీటీసీ, స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలన్నా రు. కార్యక్రమంలో ఆదిలాబాద్‌ నిర్మల్‌ జిల్లాల సీపీఎం నాగరాజు, ఎన్జీవో సీపీఎం మోయిజ్‌, మల్లికార్జున్‌, భాగ్యలక్ష్మి, కౌన్సిలర్‌ నాగరాజు, సోని, సంగీత, భోజన్న పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement