బాలవాణి.. పరిష్కారం చూపాలి మరి | - | Sakshi
Sakshi News home page

బాలవాణి.. పరిష్కారం చూపాలి మరి

Nov 17 2026 12:14 AM | Updated on Nov 17 2026 12:14 AM

● పిల్లల ప్రత్యేక ప్రజావాణి.. ● 16 అర్జీలు స్వీకరించిన అధికారులు

నిర్మల్‌చైన్‌గేట్‌: మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు బాలల హక్కుల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లలో పిల్లల కోసం ‘ప్రత్యేక ప్రజావాణి’ నిర్వహించారు. చిన్నారులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావడానికి ఏర్పాటు చేసిన ఈ వేదికకు జిల్లాలో స్పందన లభించింది. కార్యక్రమంలో అధికారులు 16 అర్జీలను స్వీకరించారు. పిల్లలు తమ సమస్యలను వినతిపత్రాల రూపంలో అందజేశారు. వాటిని తక్షణం పరిష్కరించేందుకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బాలల హక్కుల పరిరక్షణకు ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలు దోహదపడతాయని అధికారులు పేర్కొన్నారు. ఈ అర్జీలపై అధికారులు ఏ మేరకు స్పందిస్తారో.. ఎన్ని పరిష్కరిస్తారో వేచి చూడాలి.

పాఠశాలకు ప్రహరీ నిర్మించండి..

మా పాఠశాలకు ప్రహరీ నిర్మాణం కొంత పూర్తయింది. పనులు మధ్యలో ఆగాయి. దీంతో పాఠశాల ఆవరణ, తరగతి గదుల్లోకి పశువులు, పాములు వస్తున్నాయి. గతేడాది మధ్యాహ్న భోజన కార్మికురాలిని పాము కాటేసింది. గోడ ఎత్తు తక్కువగా ఉండడంతో పశువులు లోపలికి వస్తున్నాయి. గోడ ఎత్తు పెంచి పూర్తిగా నిర్మించాలి. – యూపీఎస్‌ అక్కాపూర్‌ విద్యార్థులు

బాల కేంద్రం ఏర్పాటు చేయాలి

పిల్లల సమగ్ర వికాసం కోసం జిల్లాలో సాంస్కృతిక కేంద్రం(బాల కేంద్రం) ఏర్పాటు చేయాలి. ఈ కేంద్రం ద్వారా పిల్లలకు నృత్యం, సంగీతం, కరాటే, యోగా, హస్తకళలు, భారతీయ సంస్కృతిపై శిక్షణ ఇవ్వాలి. దీంతో పిల్లలలో ఆత్మవిశ్వాసం, శారీరక దారుఢ్యం పెరుగుతాయి. – బి.శాన్విక, 3వ తరగతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement