నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Nov 14 2026 12:23 AM | Updated on Nov 14 2026 12:23 AM

శనివారం శ్రీ 14 శ్రీ నవంబర్‌ శ్రీ 2026 8లోu

న్యూస్‌రీల్‌

అప్పుడే పుట్టిన శిశువు నుంచి 15 ఏళ్ల వయసు పిల్లలకు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా రావచ్చు.

గొంతు నొప్పి ఉంటే గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి పుక్కిలించాలి.

స్వెటర్లు, మంకీ క్యాపులు వాడాలి.

త్వరగా జీర్ణమయ్యే బార్లీ, రాగి జావ ఇవ్వాలి.

వారంలో రెండుసార్లు టమాటా, మిరియాల రసం, ఆకుకూరలు వండి ఇవ్వాలి.

ముడి బియ్యం, పచ్చి బఠాణి, ఎండిన పండ్లు, కీరదోస, క్యారెట్‌, బంగాళాదుంప, గుడ్లు, పెరుగు వంటివి ఆహారంలో చేర్చాలి.

గరిష్ట ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలు.. పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు భిన్న వాతావరణంతో జలుబు, జ్వరాలు

పగలు భగ భగ.. రాత్రి గజ గజ

బాసరలో ‘కార్తిక’ సందడి

కార్తిక మాసం సందర్భంగా ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. శుక్రవారం భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో బాసర ఆలయం, గోదావరి తీరం కిటకిటలాడింది.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

కుంటాల: తెలంగాణ గోసేవా విభాగం ఆధ్వర్యంలో ఇటీవల జిల్లాస్థాయిలో నిర్వహించిన పరీక్షల్లో కుంటాల ఉన్నత పాఠశాల విద్యార్థులు రేషన్‌ వార్‌ బాలమణి, బోయిడి స్వప్న, దే వుళ్ల శిరీష పాఠశాలస్థాయి, జిల్లా స్థాయిలో ప్ర తిభ కనబర్చారు. రాష్ట్రస్థాయి పోటీ పరీక్షలకు ఎంపికయ్యారు. 15న హైదరాబాద్‌లోని కేశవ మెమోరియల్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించే రాష్ట్రస్థాయి పరీక్షల్లో పాల్గొననున్నారు. శుక్రవారం జిల్లా గో సేవా ప్రముఖ్‌ కొత్త కాపు నారాయణ విద్యార్థులకు పాఠశాలలో హాల్‌టికెట్లు అందించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి హెచ్‌ఎం కులకర్ణి రతన్‌కుమార్‌ పాల్గొన్నారు.

చలిని సైతం లెక్కచేయకుండా ఉదయం కూరగాయల మార్కెట్‌కు వస్తున్న మహిళలు

నిర్మల్‌చైన్‌గేట్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో వేడి ఎక్కువగా ఉంటుంది. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక చీకటి పడగానే ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. చలి ప్రభావం పెరుగుతోంది. అర్ధరాత్రి నుంచి తెల్లవారు జాము వరకు చలి వణిస్తోంది. దీంతో వృద్ధులు, చిన్న పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. రెండు మూడు రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలుగా నమోదవుతుండగా, కనిష్ట ఉష్ణోగ్రతలు 18 నుంచి 15 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి.

న్యుమోనియా ముప్పు

గాలిలోని వైరస్‌, బ్యాక్టీరియా ద్వారా న్యుమోనియా వ్యాధి సోకే ప్రమాదం ఉంది. జ్వరం, జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పక్కటెముకలు ఎగరడం, నిస్సత్తువ వంటివి ఈ వ్యాధి లక్షణాలు. సిగరెట్‌, మద్యం సేవించేవారు, మధుమేహంతో బాధపడుతున్నవారు, క్షయ రోగులకు ఇది త్వరగా సోకుతుంది. పరీక్షలు చేయించుకుని వైద్యుల సలహా మేరకు మందులు వాడడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. చలికాలంలో చర్మ సమస్యలు కూడా వేధిస్తాయి. ఒళ్లంతా దద్దుర్లు, చర్మం పొడిబారడం, పెదాలు తడారిపోవడం, పగుళ్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

పాటించాల్సిన జాగ్రత్తలు..

భిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు కొన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. తప్పనిసరిగా ఉన్ని దుస్తులు ధరించాలి. ముక్కు, చెవులు, గొంతులోకి చల్లని గాలి సోకకుండా మఫ్లర్‌ లేదా మాస్క్‌ వాడాలి. బీపీ, షుగర్‌, ఆస్తమా ఉన్న వృద్ధులు చేతులు, చెవులు, మెడకు చల్ల గాలి తగలకుండా కవర్‌ ఉంచుకోవాలి. వ్యాయామంతోపాటు నడక చాలా ముఖ్యం. వేడి ఆహారం, తాజా పండ్లు తీసుకోవాలి. శీతల పానీయాలు, మద్యానికి దూరంగా ఉండాలి.

చిన్నపిల్లలకు..

పరిశుభ్రత పాటించాలి

వాతావరణంలో మార్పులతో ఒక్కసారిగా చిన్నారుల్లో జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు పెరిగాయి. ఈ కాలంలో డిప్తీరియా వచ్చే అవకాశాలు ఎక్కువ. పరిసరాల పరిశుభ్రత పాటించాలి. ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినాలి. ఆహార పదార్థాలపై ఈగలు, దోమలు వాలకుండా చూసుకోవాలి. జ్వరం, జలుబు వస్తే వైద్యుల సూచన మేరకే మందులు వేసుకోవాలి. – వాసుకుమార్‌,

చిన్నపిల్లల వైద్యుడు, నిర్మల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement