బాసర గర్భగుడి నిర్మాణానికి శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

బాసర గర్భగుడి నిర్మాణానికి శ్రీకారం

Nov 14 2026 12:23 AM | Updated on Nov 14 2026 12:23 AM

● ఆలయ పునర్నిర్మాణంలో కీలక ఘట్టం ● మూల నక్షత్ర శుభముహూర్తంలో ప్రథమ శిలాస్థాపన పూజ

బాసర: నిర్మల్‌ జిల్లా బాసరలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీజ్ఞానసరస్వతీ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణంలో కీలక ఘట్టం శుక్రవారం ఆవిష్కృతమైంది. కృష్ణశిలలతో ప్రధాన గర్భాలయ నిర్మాణ పనులకు ఉదయం 9:15 గంటలకు మూల నక్షత్ర యుక్త శుభ ముహూర్తంలో వైదిక బృందం శాస్త్రోక్తంగా శ్రీకారం చుట్టింది. శృంగేరి జగద్గురువుల ఆజ్ఞ మేరకు, ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం.. దేవస్థాన స్థానాచార్యులు, ప్రధానార్చకులు ఈ పవిత్ర కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) అంజనాదేవి సమక్షంలో, గర్భాలయ నిర్మాణ దాతలు సూరపనేని సునంద్‌, పద్మప్రియ దంపతుల చేతుల మీదుగా ప్రథమ కృష్ణ శిలాస్థాపన పూజ జరిపించారు.

నిర్మాణం ప్రారంభం

ఇప్పటివరకు పాత నిర్మాణాల తొలగింపు, బేస్‌ మెంట్‌ పనులు పూర్తయ్యాయని ఈవో తెలిపా రు. శుక్రవారం నుంచి కృష్ణశిలలతో ప్రధాన గర్భాలయ నిర్మాణ పనులు అధికారికంగా ప్రా రంభించినట్లు వెల్లడించారు. ఆలయ ప్రాచీన సంప్రదాయాలు ఉట్టిపడేలా, భవిష్యత్తులో భక్తులకు మరింత ఆధ్యాత్మిక వైభవాన్ని అందించేలా నిర్మాణం సాగుతుందని స్థపతి, ఆర్కిటెక్చర్‌ నిపుణులు పేర్కొన్నారు. దేవస్థాన అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, స్థపతులు, శిల్పులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

కృష్ణశిలకు పూజ చేస్తున్న ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్‌ పాఠక్‌ ప్రధాన అర్చకులు సంజీవ్‌ పూజారి, వేద పండితులు, దాతలు సూరపనేని సునంద్‌, పద్మప్రియ దంపతులు

శిలకు నమస్కరిస్తున్న అర్చకులు, దాతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement