సారంగపూర్: మండలంలోని స్వర్ణ గ్రామానికి చెందిన పలువురు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు కాంగ్రెస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరిరావు ఆధ్వర్యంలో రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని హైదరాబాద్‌లో కలిశారు. స్వర్ణ గ్రామంలో తమకున్న పాత ఇళ్లను తొలగించి తమకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే క్రమంలో నీటిపారుదల శాఖ అధికా రులు అడ్డుపడుతున్నారని తెలిపారు. తాము నిర్మించే ఇళ్ల స్థలాలు ఇరిగేషన్ శాఖకు సంబంధించినవని, నిర్మాణా లు నిలిపివేయాలని ఒత్తిడి తెస్తున్నారని మంత్రికి వివరించారు. విషయం తెలుసుకున్న మంత్రి వెంటనే కలెక్టర్ భవేశ్ మిశ్రాకు ఫోన్ చేసి మాట్లాడారు. సదరు భూములపై విచారణ జరి పి లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రిని కలిసినవారిలో ఏఎంసీ చైర్మన్ అబ్దుల్ హాదీ ఉన్నారు.


