అర్హులకు చేయూత | - | Sakshi
Sakshi News home page

అర్హులకు చేయూత

Nov 13 2026 12:04 AM | Updated on Nov 13 2026 12:04 AM

● నేటి నుంచి లబ్ధిదారులకు పింఛన్‌ మంజూరు పత్రాలు ● 11,384 దరఖాస్తులకు 9,884 తుది ఆమోదం

నిర్మల్‌చైన్‌గేట్‌: నిరుపేదలకు సంతోషవార్త. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన ఆసరా పింఛన్లు శుక్రవారం నుంచి లబ్ధిదారులకు అందించనున్నారు. జిల్లా యంత్రాంగం ఈమేరకు ఏర్పాట్లు చేసింది. ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు ము న్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా మంజూరు పత్రాలు అందజేస్తారు. ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

9,884 మంది అర్హులు

జిల్లా వ్యాప్తంగా 11,384 మంది చేయూత పింఛన్ల కోసం దరఖాస్తు చేశారు. సెప్టెంబర్‌ 25 నుంచి క్షేత్రస్థాయిలో పరిశీలించి 9,884 మందిని అర్హులుగా ఎంపిక చేశారు. 346 మంది అనర్హులుగా తేలారు. 13 నుంచి నియోజకవర్గాలు, మండలాలు, మున్సి పాలిటీలలో ప్రత్యేక సమావేశాల ద్వారా మంజూరు పత్రాలు అందజేస్తారు. ఈ నెల 19న సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేయూత పెన్షన్లకు నిధులు విడుదల చేయనున్నారు.

వితంతువులకు తక్షణ మంజూరు

భర్తను కోల్పోయిన మహిళలకు మద్దతుగా తక్షణ పెన్షన్‌ మంజూరు చేయనున్నారు. ఈమేరకు ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు వృద్ధాప్య పెన్షన్‌దారు మరణిస్తే భార్యకు వెంటనే మంజూరు చేసేవారు. చేనేత, గీత, దివ్యాంగ, ఫైలేరియా, హెచ్‌ఐవీ, డయాలసిస్‌ వర్గాలకు ఈ విధానం లేదు. ఇప్పుడు వీరికి కూడా వర్తింపజేస్తా రు. ఈ వర్గాలలో పెన్షన్‌దారు మరణించినప్పుడు భార్య వయసు 57 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే వితంతు వర్గం కింద పెన్షన్‌ మంజూరు చేస్తారు.

పాత పింఛన్లే..

కొత్తగా మంజూరైన పింఛన్లకు ప్రస్తుతం అమల్లో ఉన్న మొత్తాలనే వర్తింపజేయనున్నట్లు తెలుస్తోంది. వృద్ధులు, వితంతువులు, ఇతర అర్హులకు రూ.2,016, దివ్యాంగులకు రూ.4,016 చొప్పున అందించే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేయూత పథకం కింద పింఛన్లు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. కొత్త పింఛన్లకు ఏ మొత్తం వర్తింపజేస్తారన్నది స్పష్టత రావాల్సి ఉంది.

వృద్ధులు, బీడీ కార్మికులకు నిరాశ

కొత్త పింఛన్లతో కొందరికి లబ్ధి జరుగుతు న్నా, మరికొందరికి నిరీక్షణ తప్పడం లేదు. వయసు మీదపడటంతో కూలీ పనులకు వెళ్లలేని వృద్ధులు, బీడీ కార్మికులు పింఛను కోసం ఎదురుచూస్తున్నారు. అనారో గ్య సమస్యలు, వయోభారం, పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో కుటుంబ పోషణ భారంగా మారిందని వారు ఆవేదన చెందుతున్నారు. గతంలో పలుమార్లు దరఖాస్తులు చేసుకున్నా, కొత్తగా మంజూరు చేసే విభాగాల్లో వీరికి మినహా యింపు ఇచ్చారు. కొత్త పింఛన్ల పంపిణీతోపా టు మిగిలిన అర్హుల దరఖా స్తులను కూడా పరిశీలించి తదుపరి విడతలో న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement