అడెల్లిలో దుకాణాల వేలం | - | Sakshi
Sakshi News home page

అడెల్లిలో దుకాణాల వేలం

Nov 13 2026 12:04 AM | Updated on Nov 13 2026 12:04 AM

సారంగపూర్‌: జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అడెల్లి శ్రీమహాపోచమ్మ దేవాలయం ప్రాంగణంలో నిర్వహించే వివిధ దుకాణాలకు గురువారం బహిరంగ వేలం నిర్వహించారు. ఇందులో ఆలయానికి రూ.7.81 లక్షల ఆదా యం సమకూరింది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈవేలంలో వివిధ గ్రా మాలకు చెందిన వ్యాపారులు ధరావత్తు సొ మ్ము చెల్లించి పాల్గొన్నారు. ఆలయ పరిసరా ల్లో బొమ్మలు, సీడీలు, కంకణాలు విక్రయించే దుకాణాన్ని రూ.6.01 లక్షలకు ఎస్‌.రత్నమా ల అనే వ్యాపారి దక్కించుకోగా, ఆలయ ప్రాంగణంలో టెంట్లు, వంటపాత్రలు అద్దెకు ఇచ్చే హక్కును సీహెచ్‌.వెంకటేశ్‌ రూ.1.80 లక్షలకు దక్కించుకున్నాడు. కార్యక్రమంలో తానూర్‌ మండలం ఎల్వత్‌ దత్తమందిర్‌ ఈవో ఎస్‌ రమణారావు, అడెల్లి ఆలయ ఈవో భూమయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement