సారంగపూర్: ఎల్‌నినో నేపథ్యంలో రైతులు యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేయాలని జిల్లా ఇన్‌చార్జి వ్యవసాయాధికారి రవి అన్నారు. మండలంలోని బోరిగాంలో ఎండిపోయిన పంటలను గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడి రైతులతో మాట్లాడారు. ఈయేడాది ఎల్‌నినో ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. అందుకే తక్కువనీటి వినయోగంతో సాగయ్యే శనగ, జొన్న, కుసుమ, పెసలు, మినుములు, కూరగాయలు ఎంచుకోవాలని తెలిపారు. ఇప్పటికే పంటలు నష్టపోయిన రైతుల వివరాలను రైతుభరోసా పోర్టల్‌లో నమోదు చేస్తున్నామన్నారు. ఇందులో నాయకులు బొబ్మిలి శ్రీనివాస్, మీర రాజు, కొప్పుల లింగం, వంగ నారాయణరెడ్డి, రాజారెడ్డి, రాములు, ఏఈవో ఉమేష్, రైతులు ఉన్నారు.


