చెరువుకట్ట పునర్నిర్మాణానికి నిధులు ఇవ్వండి | - | Sakshi
Sakshi News home page

చెరువుకట్ట పునర్నిర్మాణానికి నిధులు ఇవ్వండి

Nov 14 2026 12:23 AM | Updated on Nov 14 2026 12:23 AM

నర్సాపూర్‌(జి)/సారంగపూర్‌: గతేడాది కురిసిన భారీ వర్షాలకు మండల కేంద్రం శివారులో దేవుని చెరువు కట్టకు భారీ గండి పడింది. గొలుసు కట్టు చె రువులకు నీరు అందించే దేవుని చెరువు కట్ట పునర్ని ర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కాంగ్రెస్‌ నిర్మల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరిరావుతో కలిసి నర్సాపూర్‌(జి) సర్పంచ్‌ గడ్డం ఇంద్రకరణ్‌రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని శుక్రవారం కలిశారు. ఈమేరకు వినతిపత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించి త్వరలో నిధులు విడుదలయ్యేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు సర్పంచ్‌ తెలిపారు. కార్యక్రమంలో డీసీ సీ జిల్లా కార్యదర్శి ఉమామహేశ్వర్‌ పాల్గొన్నారు.

‘స్వర్ణ’పై లోలెవెల్‌ కాజ్‌వే నిర్మించాలి

మండలంలోని యాకర్‌పెల్లి–వంజర్‌ గ్రామాల మధ్య స్వర్ణ నదిపై లోలెవెల్‌ కాజ్‌వే నిర్మించాలని వంజర్‌, యాకర్‌పెల్లి గ్రామాల నాయకులు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. యాకర్‌పెల్లి గ్రామానికి చెందిన రైతులకు పెద్దమొత్తంలో వాగు అవతలివైపు(వంజర్‌వైపు)పొలాలు ఉన్నాయని తెలిపారు. అయితే ఏటా వర్షాకాలం వాగుదాటడం ఇబ్బందిగా ఉందని పేర్కొన్నారు. ఇదే వాగులోంచి ఏటా ఉత్తర తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అడెల్లి మహాపోచమ్మ ఆభరణాలు గంగనీళ్ల జాతర సందర్భంగా గోదావరికి తరలిస్తారని పేర్కొన్నారు. జాతర సమయంలో అమ్మవారి భక్తులను దాటించడం పోలీస్‌, ఇరిగేషన్‌ అధికారులకు సవాల్‌గా మారిందన్నారు. రైతుల వినతి మేరకు వంతెన నిర్మాణం చేపట్టడానికి మంత్రి సానుకూలంగా స్పందించారని నాయకులు నవీన్‌, రాజేశ్వర్‌ తెలిపారు.

లిఫ్ట్‌ ఇరిగేషన్‌ మంజూరు చేయాలి..

మామడ: మామడ, కప్పన్‌పల్లి, దిమ్మదుర్తి గ్రామాలకు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ మంజూరు చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కాంగ్రెస్‌ నిర్మల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరిరావు వినతిపత్రం అందించారు. మూడు గ్రామాల రైతులు వర్షాధారంగా పంటలు సాగు చేస్తున్నారని, సరస్వతి కాలువ ద్వారా నీటిని అందించే తుర్కం చెరువు నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిని అందించాలని కోరారు. సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement