పాఠశాలలో మంటలు | - | Sakshi
Sakshi News home page

పాఠశాలలో మంటలు

Nov 11 2026 12:25 AM | Updated on Nov 11 2026 12:25 AM

చిరుతపులి దాడిలో మేక మృతి బెజ్జూర్‌: బెజ్జూర్‌ అటవీ రేంజ్‌ పరిధిలో చిరుతపులి దాడిలో మేక మృతి చెందింది. మంగళవారం ఎలకపల్లి గ్రామానికి చెందిన నికాడి మల్లయ్య తన మేకలను మేత కోసం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా చిరుతపులి మేకపై దాడి చేసింది. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా బీట్‌ అధికారి నవ్య, అటవీ సిబ్బంది మహేశ్‌ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. చిరుత దాడి నేపథ్యంలో గ్రామస్తులు, పశువుల కాపరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు బాధితుడికి నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు.

లక్ష్మణచాంద: మండలంలోని వడ్యాల్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వంట చేసే సమయంలో మంటలు చెలరేగాయి. మంగళవారం మండలంలోని వడ్యాల్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉదయం 11గంటలకు వంట చేసే సమయంలో సిలిండర్‌ పైపు వద్ద అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది ప్రధానోపాధ్యాయుడు భూషన్‌కు విషయం తెలుపగా వెంటనే ఫైర్‌ ఇంజన్‌కు ఫోన్‌ చేశారు. సకాలంలో చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. మంటల్లో వంట సరుకులు, పుప్పులు కొంత మేర కాలిపోయాయి. ఈ సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది శివాజీ మధ్యాహ్న భోజన కార్మికులకు పలు సూచనలు చేశారు. ఇందులో సిబ్బంది రాజలింగు ఉన్నారు.

గంజాయి సేవించిన

ఇద్దరిపై కేసు

ఆదిలాబాద్‌టౌన్‌: గంజాయి సేవించిన ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్‌ సీఐ సునీల్‌ కుమార్‌ తెలిపారు. వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం గంజాయి సేవిస్తున్నట్లు సమాచారం రావడంతో దాడిచేసి పట్టుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి 2 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

నేటితో ముగియనున్న స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు గడువు

కాగజ్‌నగర్‌టౌన్‌: బతుకమ్మ, దసరా పండుగలు పురస్కరించుకొని గత నెల 9న ప్రారంభించిన 07711/12 బతుకమ్మ ఎక్స్‌ప్రెస్‌ రైలు గడువు బుధవారం ముగియనుంది. ఈ రైలుకు ప్రత్యేక ఆదరణ లభించడంతో రైలును పొడిగిస్తారా..? లేదా..? అన్న సందేహం ప్రయాణికుల్లో నెలకొంది. మొదట్లో బతుకమ్మ, దసరా వరకు నడిపిస్తామని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించినప్పటికీ దీపావళి వరకు పొడిగించింది.

రద్దీతో కిటకిటలాడిన బోగీలు

ఈ ప్రత్యేక రైలులో ప్రతీరోజు బోగీలు ప్రయాణికులతో కిటకిటలాడాయి. కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి మీదుగా వెళ్లే ఈ రైలులో ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, కూలీలు పెద్ద సంఖ్యలో ప్రయాణించారు. బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేస్తున్న సమయంలో ఈ రైలు పేద, మధ్య తరగతి ప్రయాణికులకు పెద్ద ఊరటనిచ్చింది. వివిధ రాజకీయ పార్టీల నాయకులు మాత్రం ఈ రైలును శాశ్వతంగా నడిపించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. వచ్చే నెలలో భారత ప్రధాని నరేంద్రమోడీ పర్యటన సందర్భంగా ఈ రైలును క్రమబద్ధీకరించి ప్రారంభిస్తారా..? లేదా..? అని ప్రయాణికులు వేచిచూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement