శబరిమలలో అయ్యప్ప స్వాములకు నిత్యాన్నదానం | - | Sakshi
Sakshi News home page

శబరిమలలో అయ్యప్ప స్వాములకు నిత్యాన్నదానం

Nov 11 2026 12:25 AM | Updated on Nov 11 2026 12:25 AM

నిర్మల్‌టౌన్‌: అఖిలభారత అయ్యప్ప సేవా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో, నిర్మల్‌ అయ్యప్ప సేవా సమితి అనుబంధ సంస్థ ద్వారా శబరిమలలోని నిలక్కల్‌ ప్రాంతంలో అయ్యప్ప స్వాములు, భక్తుల కోసం నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ట్రస్ట్‌ సభ్యులు తెలిపారు. మంగళవారం నిర్మల్‌ ప్రెస్‌క్లబ్‌లో వారు మాట్లాడారు. నవంబర్‌ 16 నుంచి జనవరి 20 వరకు ఈ అన్నదాన కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించారు. శబరిమల యాత్రకు వచ్చే అయ్యప్ప స్వాములు, భక్తులకు ఇబ్బందులు కలగకుండా నిత్యం అన్నదానం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు ఈ అన్నదాన సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ నెల 13న పట్టణంలోని గాంధీ చౌక్‌ నుంచి నిత్యావసర సరుకులతో కూడిన డీసీఎం వాహనం శబరిమలకు బయలుదేరనున్నట్లు తెలిపారు. అయ్యప్ప స్వా ముల అన్నదాన సేవకు సహకరించాలనుకునే దాతలు తమకు తోచిన విధంగా బియ్యం, పప్పులు, నూనె తదితర నిత్యావసర సరుకులను అందజేయాలని విజ్ఞప్తి చేశారు. గురుస్వాములు చేనిగారపు చిన్నయ్య, బద్రి శ్రీనివాస్‌, ట్రస్టు సభ్యులు కనపర్తి విఘ్నేష్‌, జాప ప్రకాశ్‌, సాదం ఆనంద్‌, వస్త్రాల శివప్రసాద్‌, మారుతి, తురక శ్రీను, జ్యోతిర్మయన్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement