పండుగ వేళ కుటుంబంలో విషాదం | - | Sakshi
Sakshi News home page

పండుగ వేళ కుటుంబంలో విషాదం

Nov 11 2026 12:25 AM | Updated on Nov 11 2026 12:25 AM

● ఇంటికి వస్తుండగా అదుపుతప్పిన ద్విచక్రవాహనం ● అన్న మృతి, తమ్ముడికి గాయాలు

నార్నూర్‌: దండారీ ఉత్సవాల్లో పాల్గొని ఇంటికి తిరిగొస్తున్న సోదరులకు ఊహించని ప్రమాదం ఎదురైంది. మార్గమధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదం ఒక యువకుడి ప్రాణాలను బలిగొనగా, మరో యువకుడు గాయాలపాలయ్యాడు. గాదిగూడ ఎస్సై రమ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఉట్నూర్‌ మండలం సాలేగూడ గ్రామానికి చెందిన టేకం పవన్‌ (22), అతడి సోదరుడు టేకం సిద్ధేశ్వర్‌ ఈ నెల 9న ఉట్నూర్‌ మండలం నర్సాపూర్‌ గ్రామంలో నిర్వహించిన దండారీ ఉత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం బైక్‌పై గాదిగూడ మండలం అర్జుని కొలాంగూడకు తిరుగు పయణమయ్యారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో అర్జుని గ్రామ సమీపంలోని మూలమలుపు వద్ద వారి ద్విచక్రవాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఘటనలో పవన్‌ అక్కడికక్కడే మృతి చెందగా, సిద్ధేశ్వర్‌కు గాయాలయ్యాయి. మృతదేహాన్ని ఆదిలాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కళ్లముందే పెద్ద కుమారుడు అకాల మరణం చెంద డం, మరో కుమారుడు గాయపడటంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తండ్రి టేకం మారుతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement