ఇంద్రవెల్లి: దీపావళి పండుగ పురస్కరించుకొని ఆదివాసీ గ్రామాల్లో ప్రారంభించిన దండారీ ఉత్సవాలు మంగళవారం కొలబోడి పూజలతో ముగిశాయి. మండలంలోని వాల్గొండ, పొల్లుగూడ, తుమ్మగూడ, జెండగూడ, పాకిడిగూడ, మోడిగూడ తదితర గ్రామాల్లో గుస్సాడీలు సంప్రదాయ వాయిద్యాలు వాయిస్తూ నృత్యం చేస్తూ హారతులు స్వీకరించారు. అనంతరం గ్రామాల పొలిమేరల్లో ఇప్ప(భీమల్ మర్ర) చెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి వేషధారణ విడిచారు.
మందబొగుడలో..
బోథ్: మండలంలోని మందబొగుడ గ్రామంలో దండారీ ఉత్సవాలు మంగళవారం ముగిశాయి. ముగింపు సందర్భంగా గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పు, తుడే వాయిద్యాల నడుమ గుస్సాడీ భక్తులు సంప్రదాయ వేషధారణతో చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.


