తరోడా యువకుడిని స్వదేశానికి రప్పించండి | - | Sakshi
Sakshi News home page

తరోడా యువకుడిని స్వదేశానికి రప్పించండి

Nov 11 2026 12:25 AM | Updated on Nov 11 2026 12:25 AM

తానూరు: ముధోల్‌ మండలం తరోడా గ్రామానికి చెందిన కన్యబోయి లక్ష్మణ్‌ కుమారుడు సాయి కుమార్‌ను దుబాయ్‌ నుంచి స్వదేశానికి రప్పించాలని బీజేపీ నిర్మల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి యాతాళం చిన్నారెడ్డి ఆధ్వర్యంలో బాధిత కుటుంబ సభ్యులు మంగళవారం కరీంనగర్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. దుబాయ్‌లో హోటల్‌ యాజమాన్యం వేధింపుల కారణంగా తన కుమారుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. మానవతా దృక్పథంతో స్పందించి సాయి కుమార్‌ను త్వరగా స్వదేశానికి రప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. స్పందించిన ఆయన సాయికుమార్‌ను స్వదేశానికి రపించేందుకు అన్ని చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. తరోడా మాజీ సర్పంచ్‌ రవికిరణ్‌ గౌడ్‌, కుటుంబ సభ్యులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement