ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి

Nov 10 2026 1:13 AM | Updated on Nov 10 2026 1:13 AM

నిర్మల్‌టౌన్‌: పోలీస్‌ ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, చట్టపరంగా పరిష్కారం చూపాలని ఎస్పీ జానకీషర్మిల అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీస్‌స్టేషన్‌ అధికారులతో మాట్లాడి ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని సూచించారు. ప్రతీ ఫిర్యాదును బాధ్యతగా పరిశీలించి, బాధితులకు సకాలంలో న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరిష్కారంలో అనవసర జాప్యం లేకుండా చూడాలని పేర్కొన్నారు. ఠాణాకు వచ్చేవారితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement