● డ్రంక్ అండ్ డ్రైవ్, ఈపెట్టీ కేసుల్లో జాప్యం వద్దు ● ఎస్పీ జానకీషర్మిల
నిర్మల్‌టౌన్: పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలు, సైబర్ వారియర్స్‌తో శనివారం కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేసుల పురోగతిపై సమీక్షించారు. సైబర్ నేరాలకు సంబంధించిన కేసులను వేగంగా దర్యాప్తు చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలన్నారు. ప్రతీ కేసు పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఈపెట్టీ కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, కేసులను అనవసరంగా పెండింగ్‌లో ఉంచొద్దని ఆదేశించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు సంబంధించిన డీడీల పరిష్కారంలోనూ జాప్యం చేయొద్దన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఉపేంద్రారెడ్డి, సీఐలు కృష్ణ, మల్లేశ్, ఎస్సైలు లింబాద్రి, అశోక్, ముత్యం, శ్రావణి, డీసీఆర్బీ, ఐటీ కోర్, సైబర్ క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు.


