● నేడు కష్టాల కడలిలో అన్నదాత ● మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

● నేడు కష్టాల కడలిలో అన్నదాత ● మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

Nov 8 2026 12:19 AM | Updated on Nov 8 2026 12:19 AM

● నేడు కష్టాల కడలిలో అన్నదాత ● మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

నిర్మల్‌టౌన్‌ : కేసీఆర్‌ పాలన రైతులకు ఓ భరోసా ఇచ్చిందని, రాజులా బతికారని, కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అన్నదాత కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నాడని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. ఈ నెల 11న జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో నిర్వహించనున్న బీఆర్‌ఎస్‌ రైతు గర్జన మహాసభ ఏర్పాట్లకు శనివారం భూమిపూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రైతులకు ముందస్తు జాగ్రత్తగా సాగునీరు, తాగునీటి కోసం కేసీఆర్‌ చేపట్టిన చర్యలను పక్కనపెట్టి, ప్రాజెక్టుల నిర్వహణను రేవంత్‌ సర్కార్‌ నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. గతంలో కేసీఆర్‌ ప్రభుత్వం రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌, సాగునీరు, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో అండగా నిలిచిందని గుర్తుచేశారు. నేడు యూరియా కోసం రైతులు ఎదురుచూడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నా రు. రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యతను విస్మరించి, సాగునీటి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం వల్లే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతోపాటు వారి హక్కుల సాధన కోసం బీఆర్‌ఎస్‌ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. యూరియా కొరత, సాగునీటి ఇబ్బందులు, విద్యుత్‌ సమస్యలు, పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం, రైతు సంక్షేమ పథకాల అమలులో జాప్యం వంటి అంశాలపై రైతు గర్జన సభలో గళమెత్తనున్నట్లు చెప్పారు. ఈ నెల 11న నిర్మల్‌లో జరిగే మహాసభకు బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హాజరవుతారని వెల్లడించారు. రైతులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌, మాజీ ఎంపీ బాల్క సుమన్‌, ఖానాపూర్‌, నిర్మల్‌ నియోజకవర్గాల ఇన్‌చార్జీలు జాన్సన్‌ నాయక్‌, రాంకిషన్‌రెడ్డి, ముధోల్‌ నియోజకవర్గ సమన్వయకర్తలు పడకంటి రమాదేవి, లోలం శ్యాంసుందర్‌, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement