అంతరాయం లేని విద్యుత్‌ సరఫరా చేస్తాం | - | Sakshi
Sakshi News home page

అంతరాయం లేని విద్యుత్‌ సరఫరా చేస్తాం

Nov 8 2026 12:19 AM | Updated on Nov 8 2026 12:19 AM

● విద్యుత్‌ శాఖ డీఈ నాగరాజు ● కడెం ఫీడర్‌ విభజన పనులకు శ్రీకారం

ఖానాపూర్‌: విద్యుత్‌ వినియోగదారులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్‌ సరఫరా అందిస్తామని, తరచూ ఏర్పడుతున్న అంతరాయాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని విద్యుత్‌ శాఖ డీఈ నాగరాజు తెలిపారు. పట్టణంలోని 132/33 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో 33 కేవీ కడెం ఫీడర్‌ విభజనకు సంబంధించి చేపడుతున్న పనులను శనివారం పరిశీలించారు. బే విస్తరణ, బ్రేకర్‌ ఏర్పాటు పనుల పురోగతిని తనిఖీ చేయడంతోపాటు ఫీడర్‌పై ఉన్న ప్రస్తుత విద్యుత్‌ లోడ్‌ పరిస్థితులను సమీక్షించారు. పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా ఫీడర్‌ విభజన చేపట్టడం ద్వారా ఓవర్‌లోడ్‌ సమస్యను తగ్గించి, సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడవచ్చని పేర్కొన్నారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఏఈ రామ్‌సింగ్‌, సంబంధిత సిబ్బందికి సూచించారు. ఈ పనులు పూర్తయితే కడెం పరిసర ప్రాంతాల విద్యుత్‌ సరఫరా వ్యవస్థ మరింత పటిష్టమై వినియోగదారులకు మెరుగైన సేవలు అందుతాయని డీఈ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement