● భైంసా ప్రాంతంలో ఏళ్లుగా కొనసాగుతున్న సంస్కృతి
భైంసాటౌన్: ఇప్పుడు అందరికీ కంప్యూటర్ పరిజ్ఞా నం అందుబాటులోకి వచ్చింది. వ్యాపారానికి సంబంధించి నగదు లావాదేవీలన్నీ కంప్యూటర్లోనే నిక్షిప్తం చేస్తున్నారు. అయితే, భైంసాతోపాటు పరిస ర ప్రాంతాల్లో చాలామంది వ్యాపారులు గతంలో ఖాతా బుక్కులనే వినియోగించేవారు. అందులోనే రోజువారీ నగదు లావాదేవీలు నమోదు చేసేవారు. ఆ సంస్కృతిని ఇప్పటికీ కొందరు కొనసాగిస్తున్నా రు. ముఖ్యంగా భైంసా పట్టణంలోని పలు కాటన్ జిన్నింగ్ మిల్లుల్లో, కమీషన్ ఏజెంట్లు రోకడ్ ఖాతా(క్యాష్ బుక్)లు నిర్వహిస్తున్నారు. వీటిని రాసేందు కు ప్రత్యేకంగా సిబ్బంది సైతం ఉంటారు. అయితే, క్రమేపీ ఇలాంటి ఖాతాలను నిర్వహించడం తగ్గుతోంది. రాసే వారికి సైతం ఆదరణ తగ్గుతోంది. అయినా, కొందరు వర్తకులు వారి ఉపాధికి గండి కొట్టకూడదన్న సదుద్దేశంతో ఇంకా రోకడ్ ఖాతాలు నిర్వహిస్తున్నారు. వారికి ఉపాధి కల్పిస్తున్నారు.
మహారాష్ట్ర సంస్కృతి..
భైంసా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో అక్కడి సంస్కృతి ఇక్కడివారిపై ప్రభావం చూపుతుంది. వ్యాపారులు సైతం అక్కడి నుంచి ఇక్కడ స్థిరపడినవారు ఉన్నారు. ప్రతీ దీపావళి సందర్భంగా కొత్తగా ఖాతా పుస్తకాలు కొనుగోలు చేసి లక్ష్మీపూజ రోజున ఈ ‘రోకడ్ ఖాతా’లను ప్రారంభించడం ఒక విశిష్టమైన సంప్రదాయంగా వస్తోంది. లక్ష్మీపూజ ముహూర్తంలో వ్యాపారులు తమ పాత ఖాతా పుస్తకాలకు స్వస్తి చెప్పి, కుంకుమ, పసుపు, పుష్పాలతో కొత్త ‘రోకడ్‘ పుస్తకాలకు పూజ చేస్తారు. స్థానిక మార్వాడీ, గుజరాతీ, మరాఠీ వర్తక వర్గాలు ‘రోకాడ్ వహీ’ (నగదు పుస్తకం)లను కొత్త ఆర్థిక సంవత్సర ప్రారంభంగా భావిస్తారు. తొలి లావాదేవీని ‘శ్రీ’ లేదా ‘లాభ్’ అని రాసి ప్రారంభించడం ద్వారా ఏడాది పొడవునా వ్యాపారం సజావుగా, లాభదాయకంగా సాగుతుందని వ్యాపారులు నమ్ముతారు.


