కంజర్‌ భూసమస్య పరిష్కారానికి చర్యలు | - | Sakshi
Sakshi News home page

కంజర్‌ భూసమస్య పరిష్కారానికి చర్యలు

Nov 8 2026 12:19 AM | Updated on Nov 8 2026 12:19 AM

● కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా

తమిళ సంప్రదాయంలోనూ దీపావళిని ఘనంగా చేసుకుంటాం. చెడుపై మంచి గెలిచినందుకు ఈ పర్వదినాన్ని వెలుగులతో జరుపుకుంటాం. కొన్నిచోట్ల నాన్‌ వెజ్‌తోనూ సంబురాలు చేసుకుంటారు. మా ఇంట్లో అన్నిరకాల మిఠాయిలతో పండుగ ఉంటుంది. పిల్లలు, పెద్దలు అనే తేడాలేకుండా పెద్ద ఎత్తున పటాకులు కాలుస్తాం.

– కాసిమల్లి, శరవణన్‌ దంపతులు, నిర్మల్‌

ఉత్తరప్రదేశ్‌తోపాటు ఉత్తరాది ప్రాంతాల్లో దీపావళికి రామాయణమే నేపథ్యం. శ్రీరాముడు రావణుడిని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా చేసుకునే పండుగగా భావిస్తాం. దీపాలు వెలిగించి స్వాగతం పలికిన సంప్రదాయాన్ని గుర్తు చేసుకుంటాం. ఇక్కడ కూడా లక్ష్మీదేవితోపాటు పండుగ రోజు రాముడిని పూజిస్తాం. – జానమతి, వినోద్‌ దంపతులు, నిర్మల్‌

రాక్షసుడైన రావణుడిని సంహరించి లోకానికి వెలుగులు తెచ్చిన రాముడు తిరిగి అయోధ్యకు వస్తున్న సందర్భాన్ని దీపావళిగా జరుపుకుంటాం. మధ్యప్రదేశ్‌లో లక్ష్మీపూజతోపాటు రాముడికి ప్రత్యేక పూజలు చేస్తాం. చిత్రకూట్‌లోని కాంతాదాస్‌, రామాలయాలను సందర్శించడం ఆనవాయితీ. ఇక్కడ చేసుకున్నట్లే సేగలు, స్వీట్లు చేసుకుంటాం. –నమ్రత, నవీన్‌తివారీ దంపతులు, నిర్మల్‌

లక్ష్మణచాంద: మండలంలోని న్యూ కంజర్‌ గ్రామ భూ సమస్యలు త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా అధికారులను ఆదేశించారు. భూ సమస్యల పరిష్కారంపై తహసీల్దార్‌ కార్యాలయంలో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భూ సమస్యల దరఖాస్తుల సంఖ్య, సమస్యల పరిష్కారానికి చేపట్టిన చర్యల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. సర్వే సందర్భంగా ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. ప్రతీ దరఖాస్తుకు సంబంధించి వివరాలు క్లుప్తంగా నమోదు చేయాలని సూచించారు. దరఖాస్తుల వివరాలన్నీ పకడ్బందీగా నమోదు చేయాలని చెప్పారు. మండలస్థాయి ప్రజావాణి దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ వెంకట మాధవరావు, ఆర్డీవో దేవీదాస్‌, తహసీల్దార్‌ సరిత, ఎంపీడీవో వనజ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

కేసీఆర్‌ పాలన.. రైతులకు ఓ భరోసా

అయోధ్యకు రాముడిని ఆహ్వానిస్తూ..

తమిళనాట తెలుగు లెక్కనే...

మధ్యదేశంలో వెలుగుల వేడుక..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement