సదర్‌ సందడి | - | Sakshi
Sakshi News home page

సదర్‌ సందడి

Nov 8 2026 12:19 AM | Updated on Nov 8 2026 12:19 AM

● భైంసాలో రేపు వేడుకలు ● 30 దున్నపోతులతో ప్రదర్శన ● నాలుగేళ్లుగా నిర్వహణ

భైంసాలో సదర్‌ వేడుకలు

భైంసా: సదర్‌ వేడుకలకు భైంసా సర్వం సిద్ధమైంది. సోమవారం జరగనున్న వేడుకలకు పట్టణం ముస్తాబైంది. ఇప్పటికే రైతులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది సుమారు 30 దున్నపోతులతో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. పూలమాలల అలంకరణతో కవాతు చేయనున్న వాటి విన్యాసాలు, యువత స్టెప్పులతో పండుగ కోలాహలం ఉండనుంది. వాటిని అందంగా అలంకరించి ప్రజల సందర్శనార్థం ప్రదర్శిస్తారు. ఒక్కోటి వెనుక యజమాని పడే శ్రమ, పెట్టే ఖర్చు, చూపించే ప్రేమ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే.

నాలుగేళ్లుగా వేడుకలు

భైంసాలో గత నాలుగేళ్లుగా సదర్‌ ఉత్సవాలను స్థానికులు ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. ఏటా ఈ వేడుకలపై ఆసక్తి పెరుగుతోంది. పశుపోషకులంతా ఒకచోట చేరి తమ పశుసంపదను ప్రదర్శించడంతోపాటు సంప్రదాయాన్ని భావితరాలకు పరిచయం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement