గెలుపు పొందేవరకు.. | - | Sakshi
Sakshi News home page

గెలుపు పొందేవరకు..

Nov 6 2026 11:42 PM | Updated on Nov 6 2026 11:42 PM

● అలుపు లేకుండా ట్రైనింగ్‌.. శనివారం శ్రీ 7 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

న్యూస్‌రీల్‌

నిర్మల్‌

● యువతకు ఉచిత ఆర్మీ, పోలీస్‌ శిక్షణ

పటాకులతో పదిలం

దీపావళి పండుగ అంటేనే మొదట గుర్తుకు వచ్చేది టపాసులు. టపాసులు కాల్చే సమయంలో చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.

సమన్వయంతో పనిచేయాలి

నిర్మల్‌ రూరల్‌: ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో నిర్దేశించిన లక్ష్యాలు సకాలంలో సాధించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎస్‌ సంజయ్‌జాజు ఆదేశించారు. విద్య, వీబీజీ రామ్‌జీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, తాగునీటి సరఫరా, చేయూత పింఛన్ల పరిశీలన తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా, అదనపు కలెక్టర్‌ రాథోడ్‌ రమేశ్‌ పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాల అమలు, నిధుల వినియోగం, నిర్దేశిత లక్ష్యాల పురోగతిపై సీఎస్‌ సమీక్షించారు. సమగ్ర శిక్ష అభియాన్‌, పీఎంశ్రీ పథకాల కింద మంజూరైన నిధులను జనవరి మొదటి వారంలోగా గరిష్ట స్థాయిలో వినియోగించాలని సూచించారు. పీఎంశ్రీ పథకం కింద ఎంపికై న పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. వేసవి కాలం ముగిసే వరకు ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించడమే ప్రధాన ప్రాధాన్యతగా ఉండాలని సీఎస్‌ స్పష్టం చేశారు. నవంబర్‌ 15లోగా చేతిపంపులు, బోర్లు, బావులకు సంబంధించిన మరమ్మతులు పూర్తి చేయాలని, నవంబర్‌ 15 నుంచి డిసెంబర్‌ 31 వరకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి తాగునీటి సమస్యలను గుర్తించి పరిష్కరించాలని ఆదేశించారు. వీబీజీ రామ్‌జీ పథకం కింద చేపట్టే పనులను నాణ్యతతో, మార్చి నెలాఖరు నాటికి 12 కోట్ల పనిదినాల లక్ష్యాన్ని సాధించాలని సీఎస్‌ సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్డీవో విజయలక్ష్మి, డీఈవో భోజన్న, హౌసింగ్‌ పీడీ శ్రీనివాస్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రవిబాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

నిర్మల్‌ డిగ్రీ కళాశాల మైదానంలో ఫిజికల్‌ ఫిట్‌నెస్‌పై శిక్షణ పొందుతున్న యువతీ యువకులు

మామడ: గ్రామీణ నిరుద్యోగ యువతకు ఆర్మీ, పోలీస్‌ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్నా సరైన మార్గదర్శకత్వం లేక అవకాశాలు కోల్పోతున్నారు. ప్రత్యేక శిక్షణ ఖరీదైనందున పేద కుటుంబాలవారు ఆర్థిక భారంతో దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ జానకీషర్మిల ఆదేశాలతో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఉచిత శిక్షణ ఇస్తున్నారు.

శిక్షణ ఇలా..

మారుమూల గ్రామాల నుంచి వచ్చిన యువతను రాతపరీక్ష, ఫిజికల్‌ ఈవెంట్లకు సన్నద్ధం చేస్తున్నారు. జనరల్‌ ఇంటలిజెన్స్‌, రీజనింగ్‌, జనరల్‌ నాలెడ్జ్‌, గణితం, భాషా నైపుణ్యాలపై తరగతులు నిర్వహిస్తున్నారు. 230 మందికి ఉచిత భోజనం, వసతి, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌, లైబ్రరీ సౌకర్యం కల్పించారు. ట్రైనర్‌ జాదవ్‌ వెంకటేశ్‌ ఉదయం, సాయంత్రం రన్నింగ్‌, లాంగ్‌జంప్‌ తదితరాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఎస్‌ఎస్‌సీ జనరల్‌ డ్యూటీ, అగ్నివీర్‌ పరీక్షల్లో వివిధ దశలు దాటి 15 మంది సిద్ధమయ్యారు. పోలీస్‌ పరీక్షలు నెల రోజుల్లో ఉండటంతో శిక్షణ పొడిగించాలని యువత కోరుతున్నారు. గెలిచేవరకు అండగా ఉండాలంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement