ఖానాపూర్: మండలంలోని ఆదివాసీ గూడేల్లో దండారీ సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. దీపావళి పర్వదినానికి వారం ముందు ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలను ఆదివాసీలు సంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నారు. కోలాటాలు, సంప్రదాయ నృత్యాలు, గుస్సాడీ నృత్యాలతో పల్లెల్లో పండుగ సందడి నెలకొంది. ఖానాపూర్ మండలం బీర్నంది గ్రామపంచాయతీ పరిధిలోని ఇప్పమాడలో కడెం మండలం కొత్త మైసమ్మపేటకు చెందిన ఆదివాసీ బృందం పాల్గొని సంప్రదాయ నృత్యాలతో సందడి చేసింది. అడవి సారంగాపూర్ గ్రామంలో ఆదివాసీలు సంస్కృతి, సంప్రదాయాలు, కళారూపాలను ప్రతిబింబించేలా దండారీ వేడుకలు జరుపుకున్నారు.


