భూసమస్యల పరిష్కారానికి కృషి | - | Sakshi
Sakshi News home page

భూసమస్యల పరిష్కారానికి కృషి

Nov 6 2026 11:42 PM | Updated on Nov 6 2026 11:42 PM

లోకేశ్వరం: భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అదనపు కలెక్టర్‌ వెంకటమాధవరావు అన్నారు. మండలంలోని అర్లి–గొడిసెరాలోని స్వాధ్యాయ వృక్ష మందరంకు కేటాయించే 312 సర్వే నంబరు భూమిని శుక్రవారం పరిశీ లించారు. అర్లి–గొడిసెరా గ్రామ శివారులోని ప్రభుత్వ భూమి 312 సర్వే నంబరులో 137 ఎకరాల భూమి ఉంది. ఇందులో 12.03 ఎకరాలను స్వాధ్యాయ వృక్ష మందిరం కోసం కేటాయించాని స్వాధ్యాయ ట్రాస్టు వారు దరఖాస్తును చేసుకున్నారు. 312 ప్రభుత్వ సర్వే నంబరులోని స్వాధ్యాయ వృక్ష మందిరంకు కేటాయించే భూమి వివరాలను తహసీల్దార్‌ సూర్యారావ్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో రికార్డులను పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు. అదపపు కలెక్టర్‌ వెంట భైంసా సబ్‌ కలెక్టర్‌ ఆజ్మీర సాయిసంకేత్‌ కుమార్‌, తహసీల్దార్‌ సూర్యారావ్‌, సర్పంచ్‌ జంగం ప్రసన్న, ఏంపీవో సోలమాన్‌రాజ్‌, సర్వేయర్‌ మల్లికార్జున్‌, ఆర్‌ఐ లలిత ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement