నిర్మల్‌టౌన్: నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్‌ఆర్‌ఎస్) కొత్త మాడ్యూల్‌పై పోలీస్ సిబ్బందికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం అవగాహన కల్పించారు. జన సమూహాల్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని, నాఫిస్ ద్వారా వేలిముద్రల ఆధారంగా వ్యక్తులను గుర్తించే ప్రక్రియ గురించి వివరించారు. ఫింగర్ ప్రింట్ యూనిట్, డీసీఆర్‌బీ, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.
ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి
భైంసాటౌన్: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని ఎస్పీ జానకీ షర్మిల ఆదేశించారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ప్ర జావాణి నిర్వహించి డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల అర్జీదారుల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. ప్రతీ ఫిర్యాదుపై వెంటనే స్పందించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భరోసా కేంద్రంలో కుటుంబ సమస్యలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై షీ టీం సిబ్బంది ఇస్తున్న కౌన్సిలింగ్ తీరును పరిశీలించారు. అనంతరం గత గ్రీవెన్స్ ఫిర్యాదుల స్థితిగతులపై సమీక్షించారు. ఏఎస్పీ సాయికిరణ్ ఉన్నారు.


