కుంటాల: ఉపాధిహామీలో అక్రమాలకు తావి వ్వొద్దని డీఆర్డీవో విజయలక్ష్మి సూచించారు. బుధవారం కుంటాల రైతువేదికలో నిర్వహించిన వీబీ జీరామ్‌జీ 16వ విడత సామాజిక తని ఖీ ప్రజావేదికలో పాల్గొని మాట్లాడారు. మండలంలో 2025–26లో రూ.2.83 కోట్లతో చేపట్టిన ఉపాధి, పంచాయతీరాజ్ పనులు, పింఛన్లపై సామాజిక తనిఖీ బృందాలు తనిఖీ చేపట్టాయని తెలిపారు. ప్రజావేదికలో తీర్మానం లే కుండానే పనులు చేపట్టడం, ఒకరి పేరుతో మ రొకరు బిల్లులు తీసుకోవడం లాంటి అంశాలు వెల్లడయ్యాయి. కార్యక్రమంలో ఎంపీడీవోలు గణపతివార్ వెంకటరాజు, వనజ, లింబాద్రి, ఎంపీవో శోభన, హెచ్‌ఆర్ మేనేజర్ సుధాకర్, పీఆర్ ఏఈ గౌరీశ్, ఎస్సార్ సుశీల, ఏపీవో నవీన్, సర్పంచులు జక్కుల గజేందర్, కుభీర్ రాజన్న, శివాజీ తదితరులున్నారు.


