నిర్మల్‌చైన్‌గేట్: ఉద్యోగులు విధి నిర్వహణతోపాటు, తమ ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ భవేశ్‌మిశ్రా అన్నారు. కలెక్టరేట్‌లో ఉద్యోగుల కోసం జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని కలెక్టర్ సందర్శించి మాట్లాడారు. కలెక్టరేట్ అధికారులు, ఉద్యోగులంతా వైద్య శిబిరంలో ఉచితంగా రక్త పరీక్షలు చేసుకునేలా చూడాలన్నారు. అనారోగ్య సమస్యలు ముందుగానే తెలుసుకోవడం ద్వారా మేలు ఉంటుందన్నారు. తగిన మందులు, జాగ్రత్తలు, జీవనశైలిలో మార్పుల ద్వారా మంచి ఆరోగ్యకర జీవితాన్ని పొందవచ్చునన్నారు. ప్రతీరోజు శారీరక వ్యాయామాలు, యోగా అలవాటు చేసుకోవాలని సూచించారు. ఉద్యోగులంతా రక్త పరీక్షలు పూర్తి చేసుకునే వరకు వైద్య శిబిరం కొనసాగించాలని తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో రాజేందర్, అధికారి సౌమ్య, సిబ్బంది పాల్గొన్నారు.
ఓటరు జాబితా సవరణ వేగవంతం చేయాలి
నిర్మల్‌చైన్‌గేట్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ భవేశ్‌మిశ్రా అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ పురోగతి, పెండింగ్ ఫారం– 6, 7, 8 దరఖాస్తుల పరిష్కారం, ఇతర ఎన్నికల సంబంధిత అంశాలపై సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్లు రాథోడ్ రమేశ్, వెంకట మాధవ రావు, ఆర్డీవో దేవీదాస్, అధికారులు పాల్గొన్నారు. సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ, ఫారం–6, 7, 8 దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలన్నారు. ఎస్‌ఐఆర్‌లో తప్పుగా మ్యాపింగ్ అయిన ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. అనర్హుల విషయంలో తగిన ఆధారాలతో రికార్డులు భద్రపరచాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్‌లో దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను మొత్తం పారదర్శకంగా పూర్తిచేస్తామని తెలిపారు.


