కలెక్టర్‌గారు.. మేమున్నాం | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌గారు.. మేమున్నాం

Nov 1 2026 12:15 AM | Updated on Nov 1 2026 12:15 AM

కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రాపై భైంసా మున్సిపల్‌ కార్యాలయ సమావేశంలో కొందరు చేసిన అనుచిత వ్యాఖ్యలను టీజీఈజేఈసీ, పెన్షనర్ల సంఘం తీవ్రంగా ఖండించాయి. జిల్లా కేంద్రంలో ఉద్యోగులు శనివారం నల్లబ్యాడ్జీ లు ధరించి నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి తమ సంఘీభావం ప్రకటించారు. నిజాయితీ, నిబద్ధతతో జిల్లా అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్న కలెక్టర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. కలెక్టర్‌కు ఉద్యోగ, పెన్షనర్లు ఎల్లవేళలా అండగా ఉంటామని స్పష్టం చేశారు. కలెక్టర్‌పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టీజీఈజేఈసీ గౌరవాధ్యక్షుడు ఎంసీ.లింగన్న, చైర్మన్‌ వి.ప్రభాకర్‌, ప్రధాన కార్యదర్శి పీసీ.రెడ్డి, టీజీవో ప్రధాన కార్యదర్శి రమేశ్‌, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. – నిర్మల్‌చైన్‌గేట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement