నిర్మల్‌చైన్‌గేట్: సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యతా స్ఫూర్తితో మనమంతా ముందుకు సాగాలని కలెక్టర్ భవేశ్‌మిశ్రా పిలుపునిచ్చారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతి(జాతీయ ఐక్యతా దినోత్సవం)ని శనివా రం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌తోపాటు అధి కారులు పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఐక్యతా ప్రతిజ్ఞ చే శారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వా తంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించడంతోపా టు, దేశంలోని అనేక సంస్థానాలను భారత్‌లో విలీ నం చేసి ‘ఉక్కు మనిషి’గా పటేల్ చరిత్ర సష్టించార ని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదనపు కలెక్టర్లు రాథోడ్ రమేశ్, వెంకట మాధవరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


