కడెం: వినియోగదారులను మోసం చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా తూనికలు, కొలతల(లీగల్ మెట్రాలజీ) అధికా రి పి.శంకర్ హెచ్చారించారు. మండలంలోని పలు దుకాణాల్లో శని వారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మండల కేంద్రంలోని సత్తయ్య కిరా ణా దుకాణంలో బియ్యం బస్తా 25 కిలోలకు కిలో తక్కువ ఉండడంతో కేసు నమోదు చేశా రు. ఎస్వీఆర్ సూపర్ మార్కెట్లో ప్యాకింగ్ లైసెన్స్, తూకం యంత్రం స్టాంపింగ్ లేకపోవ డం, అమృత జ్యువెల్లర్స్లో నిబంధనలు ఉల్ల ఘించినందుకు కేసులు నమోదు చేశారు. తూ కం యంత్రాలు స్టాంపింగ్ చేయించుకోవాలని, ప్యాకింగ్ లైసెన్స్ తీసుకోవాలని సూచించారు.


