నిర్మల్‌చైన్‌గేట్: ఓటరు సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్)పై కాంగ్రెస్, ఇండియా కూటమి చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు నవంబర్ 3న నిర్మల్‌లో నిర్వహించే బీజేపీ మహా పాదయాత్రకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కోరారు. ఈ ప్రతిష్టాత్మక పాదయాత్రకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ముఖ్య అతిథిగా హాజరుకానున్న ట్లు తెలిపారు. భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల నుంచి దాదాపు 50 వేల మందికిపైగా కార్యకర్తలు, ప్రజలు ఈ పాదయాత్రలో పాల్గొంటారని తెలిపారు. అందుకు తగినట్లుగా బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రణాళికతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు అయ్యన్నగారి భూమయ్య, తక్కల రమణారెడ్డి, జమాల్, మార గంగారెడ్డి, సాదం అరవింద్, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, కరిపే విలాస్, కౌన్సిలర్లు గంజి రాజు, శ్రీరామోజీ నరేశ్, జింక సురేందర్, సూరజ్ నాయక్ నాయకులు పాల్గొన్నారు.


