పోలీస్‌ అమరులకు నివాళి | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ అమరులకు నివాళి

Oct 30 2026 11:55 PM | Updated on Oct 30 2026 11:55 PM

ఖానాపూర్‌: పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఖానాపూర్‌లో శుక్రవారం రాత్రి పోలీస్‌ అమరులకు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌ నుంచి జగన్నాథరావు చౌరస్తా వరకు ర్యాలీ తీశారు. నిర్మల్‌ డీఎస్పీ శ్రీనివాస్‌, ఖానాపూర్‌ సీఐ సత్యనారాయణ పాల్గొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరు ల త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్సైలు సాయికుమార్‌, హనుమాండ్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు గుమ్ముల అశోక్‌, తోడసం ఇందిరా, దయానంద్‌, ప్రకాశ్‌గౌడ్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement