విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలి

Oct 30 2026 11:55 PM | Updated on Oct 30 2026 11:55 PM

● సీనియర్‌ సివిల్‌ జడ్జి జి.రాధిక, జుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ భవిశ్య

నిర్మల్‌ రూరల్‌/నిర్మల్‌టౌన్‌/లక్ష్మణచాంద: సమాజంలో జరుగుతున్న వివిధ సంఘటనల నేపథ్యంలో విద్యార్థినులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి, డిస్ట్రిక్‌లీగల్‌ సర్వీస్‌ అథారిటీస్‌ సెక్రెటరీ జి.రాధిక, జుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ భవిశ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని సోమవార్‌పేట్‌ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, లక్ష్మణచాందలోని పీఎంశ్రీ పాఠశాలలో శుక్రవారం ‘సురక్షిత్‌ బచ్‌ పన్‌ అభియాన్‌’ నిర్వహించారు. న్యాయమూర్తులు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు అపరిచిత వ్యక్తులతో మాట్లాడకూడదని, వారు ఏదైనా బహుమతులు ఇస్తే తీసుకోకూడదని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు, పోషకులు చెప్పే విషయాలను అనుసరించాలన్నారు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని తెలిపారు. పోక్సో, బాలల హక్కలు, మాదకద్రవ్యాల నిరోధకచట్టం, రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమాల్లో జేజేబీ బోర్డు సభ్యుడు డాక్టర్‌ నరేశ్‌కుమార్‌, లక్ష్మణచాంద ఎంఈవో రాజునాయక్‌, డీఎల్‌ఎస్‌ఏ సభ్యులు లింగాగౌడ్‌, హెచ్‌ఎంలు ముడారపు పరమేశ్వర్‌, పోతన్న, లీగల్‌సెల్‌ చీఫ్‌ న్యాయవాది కే.రాజలింగం, లీగల్‌ వాలంటరీ లోలం గంగన్న, కేఎస్‌. గంగాధర్‌, చైల్డ్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ శ్రీలత, ఎండీ. గౌసొద్దీన్‌, అడ్వకేట్‌ దిలీప్‌రెడ్డి, సర్పంచ్‌ ఓస కవిత, ఎస్సై శ్రావణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement