ఉట్నూర్‌రూరల్: పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్య అందించడంతో పాటు విద్యా ప్రమాణా లను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఐటీడీఏ పీవో మంద మకరందు సూచించారు. బుధవారం ఉట్నూర్‌లోని కు ము రం భీం కాంప్లెక్స్‌లో ఉన్న పీఎంఆర్‌సీ భవనంలో ప్రధానోపాధ్యాయులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో వి ద్యార్థులకు అందుతున్న సదుపాయాలు, విద్యార్థుల హాజరు, సంక్షేమ పథకాలు, పదో తరగతి పరీ క్షల సన్నద్ధత తదితర కీలక అంశాలపై సమీక్షించా రు. ఆయన మాట్లాడుతూ డైట్ బిల్లులు, ప్రీ మె ట్రిక్, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు, యూనిఫాంల పంపిణీ, మౌలిక సదుపాయాలు సక్రమంగా అందేలా అధికారులు, ప్రధానోపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఇన్‌స్పెక్షన్ యాప్, విద్యా వీక్షణ కార్యక్రమం, యూడైస్ పోర్టల్ ద్వారా విద్యార్థుల పురోగతిని పర్యవేక్షించాలన్నారు. నవంబర్ 1 నుంచి 15 వరకు కార్యక్రమాలపై అవగాహ న కల్పించడంతో పాటు, నవంబర్ 5లోగా విభాగ స్థాయి క్రీడా పోటీలను పూర్తి చేయాలన్నారు.
వీసీలో పాల్గొన్న పీవో..
గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించిన వివిధ అభివృద్ధి అంశాలపై సమీక్షించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అధ్యక్షతన, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, గ్రామీణాభివృద్ధి కమిషనర్ సమక్షంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా ఉట్నూర్ ఐటీడీఏ పీవో మంద మకరందు తమ కార్యాలయాల నుంచి వీసీలో పాల్గొన్నారు. సంబంధిత అధికారులందరూ సమన్వయంతో ప్రభుత్వ లక్ష్యాలను సాధించే దిశగా తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులు ఆదేశించినట్లు పీవో తెలిపారు.
ఉత్సవ పోస్టర్ ఆవిష్కరణ
ఉట్నూర్‌రూరల్: గొండ్వానా భూభాగంలో అత్యంత పవిత్రమైన ఎత్మసార్ ఉత్సవాలు, గుస్సాడి –పద్మల్‌పూరి కాకో దేవత పోస్టర్‌ను ఐటీడీఏ కార్యాలయంలో పీవో మంద మకరందు ఆవిష్కరించారు. నిర్వాహకులు మాట్లాడుతూ.. నవంబర్ 5న పద్మల్‌పూరి కాకో దేవస్థానంలో ప్రత్యేక దర్బార్ నిర్వహించనున్నట్లు తెలిపారు. నవంబర్ 1 నుంచి 12 వరకు ఘనంగా గుస్సాడి –దండారి ఉత్సవాలు జరగనున్నాయన్నారు. ఈ పవిత్ర వేడుకలకు ప్రజలు, నాయకులు పెద్ద సంఖ్యలో భారీ ఎత్తున హాజరు కావాలని వారు కోరారు. పద్మపూరి కాకో వైస్ చైర్మన్ కుమ్ర లింగారావు, రాజ్ గోండు సేవా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంగం విషంరావు, రాష్ట్ర నాయకులు తొడాసం భీంరావు, నిర్మల్ జిల్లా అధ్యక్షులు ఆత్రం రాజేశ్వర్, రాజ్ విద్యార్థి సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షులు ఆత్రం భగవంత్ రావు, పెందోర్ శ్రీనివాస్, ఆదివాసీ సేన మండల అధ్యక్షులు ఆత్రం జలపాత్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.


