ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ పట్టణంలోని క్రాంతినగర్కు చెందిన మోహన్ అనే యువకుడు అదృశ్యమైనట్లు టూటౌన్ ఎస్సై అఖిల్ తెలిపారు. ఈనెల 23న పెయింటింగ్ పనుల కోసం నిజామాబాద్ వెళ్తున్నానని ఇంట్లో చె ప్పి వెళ్లాడు. 25న ఆయనకు ఫోన్ చేస్తే కలవ డం లేదని, స్విచ్ ఆఫ్ వస్తుందని కుటుంబీకులు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
పాముకాటుతో
మహిళ మృతి
ఖానాపూర్: పాముకాటుతో మహిళ మృతి చెందిన ఘటన పెంబి పోలీస్స్టేషన్ పరిధిలోని బావాపూర్(ఆర్) తండాలో చోటుచేసుకుంది. ఎస్సై హనుమాన్లు తెలిపిన వివరాల ప్రకారం.. గుగ్లావత్ లక్ష్మి (65) మంగళవారం పంట పొలంలో పనికి వెళ్లగా పింజర కాటేసింది. కుటుంబ సభ్యులు ప్రథమ చికిత్స అందించాంచి రాత్రి వరకు వేచి చూశారు. ఉదయం పరిస్థితి విషమించడంతో నిర్మల్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలికి భర్త రాము, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు సుభాష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


