దిలావర్పూర్: మండలంలోని న్యూలోలం లిటిట్ స్కాలర్స్ ఉన్నత పాఠశాలలో బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖోఖో అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గడిచిన జిల్లా స్థాయి పోటీలు, అత్యుత్తమంగా జిల్లా, జాతీయ స్థాయిల్లో రాణిస్తున్న క్రీడాకారులపై చర్చించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్ చైర్మన్‌గా గండ్రత్ ఈశ్వర్, అధ్యక్షుడిగా నిమ్మల శ్రీధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పెరుమండ్ల కృష్ణ, కోశాధికారిగా శంకర్‌తోపాటు ఐదుగురు ఉపాధ్యక్షులను, ఐదుగురు సహాయ కార్యదర్శులను ఎన్నుకున్నారు. ఎన్నికల పరిశీలకులుగా తెలంగాణ ఖోఖో అసోసియేషన్ కోశాధికారి విలియం, ఎన్నికల అధికారిగా అడ్వకేట్ ఎన్.నరేందర్ వ్యవహరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ బి.సురేశ్‌కుమార్, ఉమ్మడి జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
రాష్ట్రీయ ఏక్తా దివస్
వేడుకలకు ఆహ్వానం
ఇచ్చోడ: గుజరాత్ రాష్ట్రంలోని కెవాడియాలో ఈ నెల 31న దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్న రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమానికి బోరిగామ సర్పంచ్ ఆసిఫ్‌ఖాన్‌కు ఆహ్వానం అందింది. గ్రామీణాభివృద్ధిలో విశేష ప్రతిభ కనబర్చినందుకు అధికారికంగా ఆహ్వానం అందినట్లు ఆసిఫ్‌ఖాన్ తెలిపారు. బుధవారం గ్రామస్తులు సర్పంచ్‌ను అభినందించారు.


