సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించాలి

Oct 29 2026 12:06 AM | Updated on Oct 29 2026 12:06 AM

ఖానాపూర్‌: బీఎల్వోలుగా విధులు నిర్వహిస్తున్న తమ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షురాలు గుడిసె సంపూర్ణ విజ్ఞప్తి చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ వెంకటమాధవరావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఎల్వోలకు నెలకు రూ.వెయ్యి మాత్రమే చెల్లిస్తున్నారని, పనికి తగిన పారితోషికం ఇవ్వాలని కోరా రు. ట్యాబ్‌లు పనిచేయడంలేదని, సెలవులు దొరకడం లేదని తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని కోరారు. వినతిపత్రం ఇచ్చినవారి లో అసోసియేషన్‌ నాయకులు వరలక్ష్మి, చందూరాణి, విజయ, లీలారాణి, మంగ, సుకన్య, మమత, వనిత, అనుపమ, గాయత్రి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement