నిర్మల్టౌన్: నవంబర్ 3న నిర్మల్లో బీజేపీ ఆ ధ్వర్యంలో మహా పాదయాత్ర నిర్వహించనుండగా బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మె ల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి బుధవారం ఏర్పాట్లు పరిశీలించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ముఖ్య అతిథిగా పాదయాత్రకు హాజరు కానున్నట్లు ఆయన తెలిపారు. హెలిప్యాడ్ ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులకు సూచనలు చేశారు. ఆయన వెంట నాయకులు జమాల్, సాదం అరవింద్, స త్యం చంద్రకాంత్, గంజి రాజు, శ్రీరామోజి న రేశ్, జింక సురేందర్, ఈశ్వర్, కూన శశాంక్, బి ట్లింగ్ నవీన్, నరేందర్, కందుల హరీశ్, భరత్, స్వాప్నిక్, నేరేళ్ల సాయి తదితరులున్నారు.


