న్యూస్‌రీల్
చరిత్రకు సాక్ష్యం ‘గాంధారి’
ఎన్నో ప్రత్యేకతలున్నా గాంధారి ఖిల్లా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధికి నోచుకోవడంలేదు. గతంలోనే ప్రతిపాదనలు తెరపైకి వచ్చినా ఇప్పటివరకుకార్యరూపం దాల్చలేదు.
కోట ముందా.. పట్టా ముందా..!
చుట్టూ ఎత్తైన రాతికట్టడంతో అద్భుతంగా 450 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ కోట.. శ్యాంగఢ్. ఘనమైన గతచరిత్రకు రాచరికపు ఆనవాలు అన్నట్లు ఉంటుంది. ఐదేళ్లక్రితం అప్పటి కలెక్టర్ దీన్ని పర్యాటకంగా అభివృద్ధి చేద్దామనుకున్నా కోటలోపలి భూమికీ పట్టా ఉన్నట్లు తేలగా విస్మయం వ్యక్తంచేశారు. ఇప్పుడు చుట్టూ ఉన్న పోరంబోకు భూములకూ ఎసరు పెడుతున్నారు. రెవెన్యూ వ్యవస్థలు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండగా సర్కారు జాగాల్లో రాళ్లు వేస్తూ, మట్టి పోస్తూ.. పాగా వేస్తున్నారు.


